రష్మితో గూడుపుఠాణి బాండింగ్...ట్రంప్ రెండో భార్య గురించైనా మాట్లాడేసుకుంటాం
on Mar 31, 2025
సుమ ఎంతలా ఆటపట్టిస్తూ మాట్లాడుతుందో ప్రదీప్ కూడా అలాగే ఆటపట్టిస్తూ నవ్విస్తూ యాంకరింగ్ చేస్తాడు. అలాంటి ప్రదీప్ తో సుమ ఒక చాట్ షోలో నలుగురు అమ్మాయిల గురించి అడిగింది. దానికి ప్రదీప్ వెరైటీ ఆన్సర్స్ ఇచ్చాడు. "ఒకరోజు కేజ్ అరెస్ట్ ఐతే గనక అది కూడా దీపికాపిల్లితోనా, అమృత అయ్యరితో అవుతావా" అని సుమా అడిగింది. దానికి ప్రదీప్ దీపికా పిల్లి అని ఆన్సర్ ఇచ్చాడు. "ఎందుకు అమృత ఆల్రెడీ నీతో సినిమా చేసేసింది అనా లేదంటే ఇప్పుడు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ఆమెతో చేస్తున్నవానా" అని అడిగింది సుమ. " లేదండి...అమృతకు తెలుగు బాగా వచ్చి. కానీ ఫోన్ అన్నా ఇంకేదన్నా వచ్చినా ఆవిడ తమిళ్, కన్నడ అన్ని భాషలూ మాట్లాడేస్తారు. దీపికా ఐతే మన తెలుగమ్మాయే కదా. ఏ టెన్షన్ ఉండదు" అని చెప్పాడు.
"ఒకరోజు కేజ్ అరెస్ట్ ఐతే గనక అది కూడా శ్రీముఖితో, రశ్మితో అంటే ఎవరిని ఎంపిక చేసుకుంటావ్" అని మళ్ళీ అడిగింది. రష్మీ అని ఆన్సర్ చెప్పేసరికి "ఎందుకు శ్రీముఖి కేజ్ లో ఉంటే డేంజరా" అని అడిగింది సుమ. " శ్రీముఖికి పంజరం అవసరం లేదు. ఆమెను అంత తొందరగా మనం మచ్చిక చేసుకోలేము. శ్రీముఖిని ఒక పంజరంలో బంధించలేము..విచ్చలవిడిగా వదిలేస్తేనే సంపూర్ణంగా, పరిపూర్ణంగా ఉంటుంది. ఐనా కూడా శ్రీముఖి, రష్మీ నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ కూడా. శ్రీముఖి నాతోనే ఫస్ట్ షో స్టార్ట్ చేసింది..అదుర్స్ షో ద్వారానే కలిసి మా కెరీర్ ను స్టార్ట్ చేసాం. ఆ టైంకి మాకు ఏమీ తెలీదు. అన్ని విషయాలను కలిసే నేర్చుకున్నాం ఇద్దరం. శ్రీముఖి కూడా ఏమీ భయపడకుండా అన్ని విషయాలను నాతో షేర్ చేసుకునేది.. ఆ షో మొదలు ఇప్పటి వరకు శ్రీముఖి అదే ఎనేర్జి కంటిన్యూ చేస్తోంది. రష్మితో నా బాండింగ్ గూడుపుఠాణిలా ఉంటుంది...అన్ని రకాల గాసిప్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రపంచంలో ఏ విషయం గురించైనా అది ట్రంప్ వాళ్ళ రెండో భార్య గురించైనా మేము మాట్లాడేసుకుంటాం."ఓ ఐతే నా గురించి ఎం మాట్లాడుకున్నారు అని సుమ ఆత్రంగా అడిగేసరికి ఐనా తెలిసినవాళ్లు గురించి మాట్లాడుకోము..ఒకవేల మాట్లాడుకున్న కూడా ఇప్పుడు చెప్తామా ఏంటి అని ప్రదీప్ కౌంటర్ వేసేశాడు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
